రైల్వే శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి… ఖాదర్ బాషా

 

రైల్వే శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి… ఖాదర్ బాషా

వెల్దుర్తి జూన్ 5 అఖండ భూమి వెబ్ న్యూస్ : –

ఒడిస్సా లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ దేశ రైల్వే శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా పత్రికా సమావేశంలో తెలిపారు.. వందలాదిగా మృతి చెందిన కుటుంబాలు దీనంగా సాయం కోసం ఎదురు చూస్తున్నాయని వెంటనే ఒక్కొక్క మృతునికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహయం వెంటనే అందించాలని, గాయపడిన వారికి కనీసం ఐదు లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలని ఖాదర్ భాషా డిమాండ్ చేశారు.. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రమాద బాధితులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా ఖాదర్ భాష కోరారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖాదర్ బాషా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!