పర్యావరణాన్ని పరిరక్షించండి పిల్లింగ్టన్ కంపెనీ యాజమాన్యం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున జరుపుకుంటారు ఈ రోజు న పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి అవగాహనను పెంచడానికి కొన్ని చర్యలు చేపడుతారు అందులో భాగంగా పిల్లింగ్టన్ కంపెనీ యాజమాన్యం అయిదు కిలోమీటర్ల వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో శ్రమదానం చేశారు కనిపించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగిస్తూ రోడ్లు ను శుభ్రం చేస్తూ శ్రమదానం చేశారు అంతే కాకుండా కంపెనీ లో పనిచేసే ఎంప్లాయిస్ కి ప్లాస్టిక్ వినియోగం పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమంలో భద్రతా విభాగం మేనేజర్ లెనిన్ బాబు మాట్లాడుతూ అన్ని పర్యావరణ సమస్యలను ఆకర్షిస్తున్న ప్రధానమైన సమస్య ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ అని పర్యావరణాన్నికాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమయ్యే భారీ మొత్తంలోని చెత్తను సమర్థవంతంగా నిర్వహించడ మే అత్యంత ముఖ్యమైన సమస్య అయితే ఈసమస్యకు పరిష్కారం ప్లాస్టిక్ను తగ్గించడం పునర్వినియోగించడం మరియు రీసైకిల్చేయడం లాంటి పద్ధతులు వలన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని ఆయన అన్నారు కంపెనీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ పర్యావరణం లేనిదే మనం లేము ప్రకృతి లేనిదే మన అభివృద్ధి లేదు వాటిని కాపాడుకుందాం అంటూ పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం మరియు ఎంప్లాయిస్ మొదలగు వారు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!