నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గణేష్ కు జనసేన పార్టీ ఇంచార్జ్ సూర్యచంద్ర సవాల్

నర్సీపట్నం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు సోమవారం ఆయన నర్సీపట్నంలోని విలేకరులతో మాట్లాడారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల కాలం గడుస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని దానిపై ఆయన బహిరంగ చర్చకు రావాలన్నారు పెట్లగణేష్ నర్సీపట్నం శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు పూర్తి చేశారో ప్రజలకు తెలియజేయాలని ఆన్ రాక్ కంపెనీ నిర్వాసితులకు రెండున్నర సెంట్లు స్థలం ఇస్తానని పలికిన పలుకులు ఏమైనాయని ఆయన ప్రశ్నించారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పలుమార్లు చెప్పినా దానిపైన ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రతి చిన్న వైద్య సేవల నిమిత్తం విశాఖపట్నం రిఫర్ చేయాల్సిన దుస్థితికి ఆసుపత్రిని తీసుకువచ్చారని ఆయన దుయ్యబట్టారు నాలుగేళ్లుగా ఏరియా ఆసుపత్రిలో లిఫ్ట్ పాడైన ఇప్పటికీ మరమ్మత్తులు చేయించలేని పరిస్థితి ఉందన్నారు నాలుగుమండలాల్లో కూడా అంబులెన్సులు అందుబాటులో లేక ప్రమాదం బారిన పడిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారన్నారు మున్సిపాలిటీలో చెత్త బళ్లకు డీజిల్ లేదన్నారు మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చిన్నపాటి వర్షాలకే రోడ్లపై నీరు ప్రవహిస్తుందడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు తాండవ రోడ్డు సమస్యను జనసేన పార్టీ వెలుగు లోకి తెచ్చినా కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు నర్సీపట్నంలో మినీ ఐటిడిఏ ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు ఈ నాలుగేళ్ల కాలంలో ఎమ్మెల్యే నర్సీపట్నం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు పెద్దపల్లి గణేష్ గొలుగొండ మండల అధ్యక్షులు గెండెం దొరబాబు నాతవరం మండలం యూత్ అధ్యక్షులు పైన మురళి వేగిశెట్టి శ్రీనివాస్ వెంకటేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!