పేద ప్రజల అభ్యున్నతే జగనన్న లక్ష్యం

పేద ప్రజల అభ్యున్నతే జగనన్న లక్ష్యం

క్రిష్ణగిరి ( అఖండ భూమి): రాష్ట్రంలో ఉన్న నిరుపేద ప్రజల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగనన్న ప్రధాన లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. గురువారం మండలంలోని కంబాలపాడు మజార గ్రామాలైన పెనుమాడ, గూడెంపాడు గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వైసిపి రాష్ట్ర కార్యదర్శి కంగాటి ప్రదీప్ కుమార్ రెడ్డి ,ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు కే ఈ సుభాషిణి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పగడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పట్ల ప్రజల్లో వస్తున్న జనాదరణ చూసి ప్రతిపక్ష టిడిపి,జనసేన పార్టీల నాయకులు వైకాపా ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు. టిడిపి,జనసేన పార్టీల నాయకులు ఎవరు ఏటువంటి యాత్ర లు చేసిన సీఎం జగన్ ముందు నిలబడలేరని, 2024 లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆర్ బి వెంకటరాముడు, వైకాపా నాయకులు శ్రీనాథ్ రెడ్డి , క్రిష్ణగిరి సొసైటీ అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి పలువురు మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!