ఉపాధి పనులు కల్పిస్తాం  వలస వెళ్లకండి…

 

స్థానికంగా పనులు కల్పిస్తాం ఏపీఓ రామకృష్ణ యాదవ్

తుగ్గలి జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఉపాధి హామీ పనులు కూలీల కు వరము లాంటివని అందువల్ల ఎవరు కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళవద్దని స్థానికంగా కూలీలకు పనులు కల్పిస్తామని ఏపీఓ రామకృష్ణ యాదవ్ అన్నారు. మంగళవారం రామలింగయ్య పల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో ఆయన మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందువల్ల కూలీలు ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి సకాలంలో పనులు చేసి తిరిగి వెళ్లాలని ఆయన తెలిపారు .సీనియర్ మేటీలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ఒక్కొక్కరికి 270 రూపాయలు పైగా వేతనం వస్తుందని ఆయన తెలిపారు. అందువల్ల కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్ ప్రదీప్ ,ఫీల్డ్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!