ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ

 

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ

తుగ్గలి జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండలంలోని బొందిమడుగుల, మారెళ్ళ గ్రామాలలో ఇటీవల అప్పుల బాధ భరించలేక వడ్డే ఆంజనేయులు, రామ్ కొండ హరిజన నర్సింహులు అనే రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతో ఆ రైతుల భార్యలు అగు వడ్డే నాగేశ్వరమ్మ ,హరిజన రాణెమ్మ ల కు మంగళవారము ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఒక్కొక్కరికి రూ 7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ అప్పుల బాధతో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు. అయితే మృతి చెందిన కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ 7 లక్షలు ఆర్థిక సహాయం అందివ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మునిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగన్న, మంకె రాముడు, పందికోన రామాంజనేయులు, గణ మద్దిలేటి, ఎంపీటీసీ మెకానిక్ మునెప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!