ఆంగ్లేయులపై పోరాటంలో అసువులు బాసిన మన్యం వీరుడు గాం గంటన్న దొరకు నివాళి అర్పించిన పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) వెబ్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అల్లూరితో ఆంగ్లేయుల పై పితుూరి పోరాటంలో పాల్గొని 1924 సంవత్సరం జూన్ 7 తేదీ
గాంగంటన్న దొర అంగ్లేయులతో పోరాటం చేస్తూ చేస్తూ వీరమరణం పొందిన రోజు గాంగంటన్న దొర పెద్దభార్యను ఆంగ్లేయులు హత్య చేయగా చిన్న భార్య యుద్ధంతో క్షత్తగాత్రులు లైనందుకు అడవిలో తీసుకెళ్తుండగా తనతో పాటు ఉన్న అనేకమంది ఆంగ్లేయులు బుల్లెట్ల తాకిడికి కుప్పకూలుతుండగా పోరాటం నుండి మడత తిప్పని యోధుడుగా నిలబడి ఆంగ్లేయులననేకులను హతమార్చి తాను బలిదానమయ్యారు భారతదేశ స్వతంత్ర కోసంతన కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ తన స్వర్వసాని చివరికి తన ప్రాణాన్ని కూడా సమర్పించిన వీర యోధులు గాంగంటన్న దొర వారి చరణాలకు ప్రణమిల్లుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము
స్వతంత్ర్య పోరాటంలో అల్లూరికి కుడిబుజం బ్రిటిష్ సేనాలను గడగడలాడించిన గిరిజన వీరుడు మాతృభూమి కోసం వీర మరణం పొందిన గాంగంటన్నా దొర కి
శత వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి



