రెండు నెలలుగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్
రాజవొమ్మంగి,అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయితీ కొమరాపురం గ్రామంలో గత రెండు నెలలుగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ సంబంధించి వాటరు మోటర్ పైపులైన్లు వేశారు గాని పైపులైనుకు కలెక్షన్ ఇవ్వడం మానేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసవికాలం కావడంతో మంచినీరు చాలా ఇబ్బంది అవుతుందని చాలా ఇబ్బందిగా ఉందని మంచినీరుపై గ్రామంలో ఎవరు స్పందించడం లేదని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం ఎండలు ఎక్కువ ఉండటంతో ఇటు ప్రజలు అటు మూగజీవాలు మంచినీరు కోసం అల్లాడుపోతున్నారు ఎవరికి మా గ్రామ మంచినీరు సమస్య కనిపించడం లేదని గ్రామస్తులు వివరిస్తున్నారు. ఇకపై నైనా వాటర్ ట్యాంక్ పై దృష్టి పెట్టి కలెక్షన్ ఇచ్చి ప్రజలకు మంచినీరు అందేలా చూడాలని అధికారులకు గ్రామ ప్రజలు మహిళలు కోరుతున్నారు.



