విలేఖర్లు ముసుగులో దందా రైతులు పై దాడి ఎదురు తిరిగిన రైతులు

విలేఖర్లు ముసుగులో

దందా రైతులు పై దాడి

ఎదురు తిరిగిన రైతులు

బిక్కవోలు. ఆకాండ భూమి

తూర్పుగోదావరిజీల్లా బిక్కవోలు మండలంలో ఇల్లపల్లి గ్రామంలో కౌలు రైతులు మొరక చదును చేసుకోవడానికి మట్టి ని తమ పోలాలు నుంచి తరిలించుకునే క్రమంలో పెదపూడి మండలం,బిక్కవోలు మండలం,రాయవరం మండలానికి చెందిన కొంతమంది విలేఖర్లుగా చెలామణి అవుతున్న బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఉన్న గ్రూప్ లో 14మంది రైతులును బెదిరించి,డబ్బులు డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వలేము అని రైతులు ఎదురు తిరిగడంతో విలేఖర్లుగా దందా కొనసాగిస్తున్న వ్యక్తులు రైతులు పై దాడి కి దిగారు.50వేల డబ్బులు డిమాండ్ చేయడంతో ఇవ్వలేము అన్నందుకు రాడ్ తో దాడికి దిగారునిచంపేస్తా మని, కులం పేరు తో దుర్భశాలడారు అని రైతులు బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.రైతులు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ద్యారాప్తు చేసిన అనపర్తి సిఐ మీడీయాకు వివరాలు తెలియజేసారు.రాత్రి 10గంటలు ప్రాంతంలో సుమారు 14మంది మీడియా ప్రతినిధులం అని రైతులును మరియు జేసిబి,ట్రాక్టర్లు డ్రైవర్లును డబ్బులు డిమాండ్ చేసారుని,రైతులు పై దాడి కూడా చేసారుని,రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు తెలియజేసారు.

విలేఖర్లు అని ఎవరైన రైతులు కాని,ప్రజలు కాని బెదరించి డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై పిర్యాదు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాముని,అలాంటి బాధితులు ఎవరైన ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సిఐ ఈసందర్భంగా తెలియజేసారు.

Akhand Bhoomi News

error: Content is protected !!