బొర్రా పంచాయతీ లో కార్యదర్శి ని నియమించాలి.
– అభివృద్ధికి ఆమడ దూరంలో బొర్రా పంచాయతీ.
అల్లూరి జిల్లా :అనంతగిరి( అఖండ భూమి)జూన్ 11 (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అనంతగిరి మండలం, బొర్రా గ్రామపంచాయతీ లో గత మూడు నెలల నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేక పోవటం తో పంచాయతీలో ఉన్న గ్రామాల అభివృద్ధి ఆమడ దూరంలో పడి ఉందని ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు శనివారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ… దేశ నలుమూల నుండీ బొర్రాగుహలును తిలకించేందుకు వచ్చే ప్రధాన బొర్రా పర్యాటక కేంద్రంలో మూడు నెలల నుండి పంచాయతీ కార్యదర్శినీ సంబంధిత మండల అధికారులు నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అసలే వేసవి కాలం పంచాయతీ లో అనేక గ్రామాలలో మంచినీటి సమస్యతో బిక్కుబిక్కుమంటూ అల్లాడిపోతుంటే, ఇంకో వైపు పర్యాటకులు వాడి పడేసిన ప్లాస్టిక్ చెత్త,చెదరాలు కుప్పలు తిప్పలుగా పడి దుర్వాసనకు గురవుతుంది. పంచాయతీలో కార్మికులు ఉన్న ఇప్పటికీ నెలల వారి జీతాలు లేక పనులు మానీవేశారు. చిన్న చిన్న నిధులు ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి లేక ఎక్కడి ఉన్న గొంగళి అక్కడ ఉన్నట్లుగా పంచాయతీ లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పరిస్థితి ఒక మూలన కూరుకు పోయిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత మండల అధికారులు చాకచక్యంగా వ్యవహరించి బొర్రా గ్రామపంచాయతీకి కార్యదర్శిని ఏర్పాటు చేసి పంచాయతీలో ఉన్న గ్రామాల సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. ఇది ఇలాగే నత్తనడకన సాగితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసన్నకుమార్, వైస్ మాజీ సర్పంచ్ విజయ్ కుమార్,గ్రామ కమిటీ లీడర్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..