మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు.

 

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు.

– ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రజానీకం.

అల్లూరి జిల్లా:అనంతగిరి (అఖండ భూమి) జూన్ 11:అనంతగిరి మండల పరిధిలో గల మారుమూల వేంగడ పంచాయతీ బందవలస నుండి పెన్నంతి గ్రామానికి 5 లక్షల జిల్లాపరిషత్ నిధులతో నిర్మించిన ఫార్మేషన్ రోడ్డును పర్యటించి పరిశీలిస్తున్న అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు వారి బృందం

ఈ సందర్బంగా వేంగడ మాజి సర్పంచ్ సివేరి కొండలరావు వారి అధ్యక్షతన జరిగిన పర్యటన సమావేశంలో జడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ నిధులు కేటాయించిన జిల్లాపరిషత్ చైర్మన్ జల్లిపల్లి.సుభద్ర కి ధన్యవాదం తెలుపుతూ జడ్పిటిసిగా గెలిచిన తర్వాత బందవలస,పెన్నంతి,

మెట్టవలస,డాలింపుట్టు,

డొంకపుట్టు గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరం తిరగక ముందే జడ్పిటిసి జిల్లాపరిషత్ 5 లక్షల నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ చేయడం జరిగింది.

ఇది వరకు నిమ్మలపాడు నుండి పెన్నంతి డొంకపుట్టు గ్రామాలకు వెళ్లాలంటే 16 కిలోమీటర్లు దూరం ఉండేది బందవలస నుండి పెన్నంతికి 3 కిలోమీటర్ల కావడం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వేంగడ సర్పంచ్ సోడేపలి.సీమ,టోకురు సర్పంచ్ కిల్లో.మోస్య,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోమెల నాగులు,వేంగడ మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు,

వార్డు మెంబర్ చంప సింహాద్రి,చప్పి.అప్పన్న,ధర్మన్న,నర్సింగరావు,కృష్ణ, నరాజీ.సురేష్ ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!