రిజర్వేషన్లు పేదరికాన్ని పెంచుతున్నాయా !తగ్గిస్తున్నాయా !

 

రిజర్వేషన్లు పేదరికాన్ని పెంచుతున్నాయా !తగ్గిస్తున్నాయా !

డా బి ఆర్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి ! అమలు జరుగుతుంది ఏమిటి..

రిజర్వేషన్లు బలవంతులుకా ? బలహీనులకా

రిజర్వేషన్లు కావాలా ! సంపద కావాలా .

కుల చాందశ వాదులతో పేదరికం వెంటాడుతుంది. సంపద తరిగిపోతుంది. మేడా శ్రీనివాస్, రాజముండ్రి…

రిజర్వేషన్లు వదులు కుని సంపద కోసం దృష్టి సారిస్తేనే పేదరికం పోతుందని, సంపద వస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.

గత 75 ఏళ్లుగా రాజ్యాంగ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, ఎంత శాతం మేరకు పేదరికాన్ని తగ్గించ గలిగారో గణాంకాలు చూపగలరా ! అని సంఘటు భారతీయుడు రిజర్వేషన్ తో పుట్టి రిజర్వేషన్ తో మరణించటమేనా ప్రజా స్వామ్యం అంటే, రిజర్వేషన్ అవసరం లేకుండా బ్రతకటం అంటే పేదరికాన్ని జయించటం వంటిదని , ప్రభుత్వం కల్పిస్తున్న కుల రిజర్వేషన్స్ తో 75 % మందికి తిండి మాత్రమే దొరుకుతుందని, బ్రతుకు మాత్రం సాధ్యం కావటం లేదని , రిజర్వేషన్ ఉన్నంత వరకు, కోరేంత వరకు పేదరికం విడిచి పోదని , రిజర్వేషన్ తో యాచనకు బానిసలుగా మార్చి సంపదను దోచుకు పోతున్నారని , చివరకు రిజర్వేషన్స్ ముసుగులో ఏర్పరిచిన సబ్ ప్లాన్ నిధులను సైతం పెట్టందారులు దోచుకుపోతున్నారని , రిజర్వేషన్ అనేది శాశ్వత పేదరికానికి లైసెన్స్ వంటిదిగా నేటి పాలకుల విధానం అని, రిజర్వేషన్లు ఉన్నంత వరకు దోపిడీకి ఎదురు వుండదని, పేద వర్గాలు పేదరికాన్ని వారసత్వ హక్కుగా మోయాల్సిందేనని , నిజానికి ప్రస్తుతం రిజర్వడ్ కేటగిరిలో కొనసాగుతున్న వారంత ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప చరిత్రిక స్థానం వుందని , పాలకుల కుట్రతో, ధనిక వర్గాల మయాజాలంతో వారి చరిత్రకు మసి పూసి

ఆ స్థానంలో ధనికులకు ప్రాధాన్యత నిస్తు కల్పిత చరిత్రను పేద వర్గాలకు బాల్యం నుండి బోధన చేస్తున్నారని , ప్రస్తుతం చరిత్ర కారులుగా చారిత్రిక ప్రచారంలో వున్న 97% అచ్చు ప్రచార చరిత్ర అని, వాస్తవ చరిత్రను శతాబ్దాల క్రితమే కుట్ర పూరీతంగా సమాధి చేసిన చరిత్ర మన ఆది పాలకుల నుండి నేటి పాలకుల వరకు అని ఆయన గుర్తు చేసారు.

పీడిత ప్రజల ఆశాజ్యోతి విశ్వ మేధావి రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ తో రచించ బడిన మన భారత రాజ్యాంగంలో పొందు పరిచినది ఏమిటి ! ప్రస్తుతం ఆచరిస్తున్నది ఏమిటని , రాజ్యాంగ విలువలు, ప్రమాణలను ఆచరించలేని పాలకుల చేతుల్లో నలిగి పోతున్న రాజ్యాంగాన్ని

కాపాడుకో వాలి అంటే రాజ్యాంగాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడు పైన ఆదారపడి వున్నదని, ఏంతో గొప్ప ఉన్నత బావాలతో రచించిన రాజ్యాంగం నేడు అక్రమర్కులను, దోపిడీ దారులను కాపాడటానికి మాత్రమే ఎక్కువ శాతం ఉపయోగపడుతుందని , పాలకులు రాజ్యాంగ భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలం అవుతుందని , సామాన్యులకు, బాధితులకు నేటి రాజ్యాంగ హక్కులు ఎందుకు పనికి రాకపోగా డబ్బున్నోడికి హక్కులను బానిసగా మార్చేస్తున్నారని, రాజ్యాంగ హక్కులు పౌరులకు కాకుండా దోపిడి దారులకు, కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా పాలనా చర్యలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయని , రాజ్యాంగం ముసుగులో సంపదను పాలకులు దారి మళ్లీస్తున్నారని, అంటరాని తనం లేని ఈ రోజుల్లో సంపదను దోచుకుంటున్నోళ్లు పెత్తందారి తనంతో అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తు మానసిక ఆనందాన్ని పొందుతున్నారని , ధనికులుగా చెలామణి అవుతున్న మెజార్టీ వర్గాలకు చెప్పుకోవటానికి ఒక గొప్ప చరిత్ర గాని, సాంప్రదాయం గాని ఉండదని , చరిత్ర, సాంప్రదాయాలు వున్న వర్గాలకు గుర్తింపు లేదని, నేడు అంబేద్కర్ సూచించిన రచించిన రాజ్యాంగం పక్కాగా అమలు జరుగుతుందని పాలకులు చెప్పగలరా ! ప్రజలు ఆశించగలరా అని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.

రిజర్వేషన్లు బలవంతులుకా ! బలహీనులుకా అనే సందేహానికి శాస్త్రీయ పరమైన సందేహం నేటికి సహెతుకత లేదని , కుల చందాస వాదులంత కుల రిజర్వేషన్స్ పెంచాలని ఉద్యమిస్తు పేదరికాన్ని వారసత్వ హక్కుగా పొందుతున్నారనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని , నాటి రాజ్యాంగ రచన స్థాపనలోనే నేడు పేదలుగా ఉన్నటువంటి వారికి అన్యాయం జరిగిందని , రిజర్వేషన్స్ బలవంతులకు కేటాయించి , సంపదను , భూమిని బలహీనులకు కేటాయించారాని , రాజ్యాంగంలో పేదలకు జరిగిన అన్యాయాన్ని అంబేద్కర్ గుర్తించకుండా ఆనాటి సంపన్న పెద్దలు కుట్రతో దృష్టి మళ్ళించారా ! అనే సందేహం ఏర్పడుతుందని , అంబేద్కర్ కలలు కన్న సమాజం, రాజ్యాంగ విలువలు, హక్కులు అమలు జరగక పొతే

ఆ రాజ్యాంగాన్ని తగల పెట్టమని సాక్షాత్తు అంబేద్కర్ మహనీయుడే సూచన ప్రాయంగా తెలిపారని , నేడు రాజ్యాంగ హక్కులన్ని సంపన్నులకే దక్కుతున్నాయని ,నేడు దోపిడి పాలకులు, ఆర్ధిక నేరగాళ్ళు విలాసంగా జీవిస్తున్నారని, పేద వర్గాలు ఆకలితో అలమటిస్తున్నారని , ప్రశ్నించి ఎదురు తిరిగే వాళ్ళు జైళ్ళలో మగ్గిపోతున్నారని , రాజ్యాంగం సాక్షిగా సమన్న మహిళలకు ఒక న్యాయం, సామాన్య మహిళలకు మరో న్యాయం అమలు జరుగుతుందని , రిజర్వేషన్లు వద్దు, సంపద ముద్దు అనే విప్లవత్మాక చైతన్యంతో సంపదను సాధిద్దాం అని, ఆత్మ వంచన వద్దని, ఆత్మగౌరవం కావాలని , దశబ్దాలుగా వెంటాడుతున్న పేద వార్గాల దారిద్రియాన్ని భూస్థాపితం చేయటానికి పేదల జీవితాల్లో నిరంతర కాగడాలుగా వెలుగునవు దామని , సంపద మాది, రిజర్వేషన్లు మీవి అనే నినాదంతో నూతన ప్రజా స్వామ్య నిర్మాణన్ని సాధించు కుందాం అని, అందుకోసం ప్రజలంతా నేటి పాలకులను సాగనంపే మహోన్నత ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి ఆర్ మూర్తి, సిమ్మా దుర్గారావు,ఎండి హుస్సేన్, దూడ్డే సురేష్, వర్ధనపు శరత్త కుమార్, వల్లి శ్రీనివాసరావు, సుంకర వెంకట భాష్కర రంగారవు , వాడపల్లి జ్యోతిష్త , మేడిచర్ల శ్రీనివాసరావు, గుడ్ల వెంకట సాయి దుర్గా ప్రసాద్ , కొమర్తి గోపి శ్రీనివాసరావు,బత్తెన శ్రీమన్నారాయణ, బసా సోనియా, ముంగండ వెంకట్రావు, వట్టి శ్రీనివాసరావు, దండా శ్రీనివాస్, సమ్మెంగి శివ ప్రసాద్, అడపా శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!