రాష్ట్రానికి దశ దిశా నిర్దేశం చంద్రబాబే
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల
వేపాడ జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాష్ట్రానికి దశ దిశా నిర్దేశం చంద్రబాబేనని ప్రజలు గ్రహించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ కోరారు. మండలంలోని కుమ్మపల్లి గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మండల పార్టీ కార్యదర్శి కొట్యాడ రమణమూర్తిల అధ్యక్షతన గ్రామ టీడీపీ పెద్దలు డెక్క దేముడునాయుడు, వేమలి వెంకటరావు, లోకిరెడ్డి సింహాద్రప్పడు, నియోజకవర్గTNSF అధ్యక్షులు డెక్క ఈశ్వరరావు తదితరుల సారథ్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కోళ్ల రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా సంపద సృష్టించగల సమర్థత గల నాయకుడు చంద్రబాబు అన్నారు. మినీ మేనిఫెస్టో ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, రైతులకు ఏడాదికి 20వేల సాగుసాయం, మహిళకు జిల్లా పరిధిలో ఉచిత బస్ ప్రయాణం, నెలకు మహిళందరికి రూ 15వందలు చొప్పున ఆర్థిక సహకారం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలండర్లు వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు దిశగా అడుగులు వేయనున్నందున ఈ హామీలను ప్రతి మహిళకు చేరవేయాలని రాంప్రసాద్ పిలుపునిచ్చారు. కొత్తవలస మండల టీడీపీ నాయకులు లాలం అర్జునరావు మాట్లాడుతూ అప్పుల ఊబినుండి రాష్ట్రాన్ని కాపాడగల ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే నన్నారు. వైసీపీని గెలిపించి మనం మోసపోయామని మరో సారి అలా జరగకుండా ప్రతి ఒక్కరూ సైనికులు మాదిరిగా పనిచేసి స్థానికంగా కోళ్ల లలితకుమారిని, చంద్రబాబులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.



