రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది

.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది

 

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

భీమవరం 28 అఖండ భూమి

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలకు రక్తహీనత తలెత్తకుండా పౌష్టికాహారం అందించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టరు పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం కాళ్ళ మండలం కాళ్ళ నెంబరు-1 సచివాలయంను జిల్లా కలెక్టరు అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించి ఎంత మంది పనిచేస్తున్నారు, ఈ రోజు ఎంత మంది హాజరు అయ్యారని పరిశీలించారు. ఐసిడియస్, వైద్య, అంగన వాడి, సచివాలయం సిబ్బందితో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎంత మంది గర్భిణీ స్త్రీలు , బాలింతలు ఎంత మంది ఉన్నారు వారికి అందరికీ మెడికల్ చెకప్ లు చేశారు, ఈ నెలలో ఎంత మంది డెలివరీ అయ్యారు, తదితర వివరాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టరు ప్రోగ్రాంలో ఏన్ని ఇల్లు కవరు చేశారు, తిరిగిన ఆ సమాచారాన్ని ఆన్లైన్ నమెడు చేశారా, తదితర సమాచారాన్ని గ్రామాలు వారీగా జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. అంగనవాడీ కేంద్రాలు ఏన్ని ఉన్నాయి, ఒకొక్క కేంద్రానికి ఎంత మంది చిన్నారులు వస్తున్నారు, వారికి విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అంది స్తున్నారా, ఏవైనా పిర్యాదులు అందితే చర్యలు తీసుకుంతున్నారా అని అడిగారు. పీహెచ్సీ లో ఉన్న డాక్టరు, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి ముందుగా వారికి ఏ విధమైన జబ్బులు ఉన్నాయో గుర్తించి వారికి అవసరమైన మందులు ఇవ్వాలని ఆమె తెలిపారు. వైద్యం అందించడంతో పాటు వారం, వారం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు అధిక ప్రాధా న్యత ఇవ్వడం జరుగుతుందని, ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో డాక్టరు వైయస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ క్లినిక్ లు నిర్మించడం జరిగిందనీ వైద్య సేవలు కావలసిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పీహెచ్సీలు అన్ని వాడుకలోకి తీసుకురావడం 108 , 104 వాహనాలను బలోపేతం చేయడం ఆరోగ్యశ్రీ అమలు చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా అందించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఐ సి డి యస్ అధికారి బి.సుజాతా రాణి, తహశీల్దారు టి ఏ కృష్ణా రావు, యం పి డి వో జి.స్వాతి, వైద్యాధికారి, ఏ యన్ యం లు, అంగన్ వాడి, సచివాలయం సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!