మే 13 మెగా లోక్ అదాలత్ ఉపయోగించుకోండి
-ప్రజా సమస్యల శాశ్వత న్యాయ పీఠం చైర్మన్ మేరీ గ్రేస్ కుమారి
భీమవరం/ఏలూరు 27 అఖండ భూమి
రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి, ప్రజా సమస్యల శాశ్వత న్యాయ పీఠం చైర్మన్ మేరీ గ్రేస్ కుమారి గురువారం ఏలూరు లోని టైటస్ నగరలోని మహిళలకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాశేశ్వరి మాట్లాడుతూ మహిళల కోసం జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఉచిత సేవలు అందిస్తుందని ఈ సేవలను అవసరమైన వారు వినియోగించుకోవచ్చని అలాగే మే 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అన్ని రకాల సివిల్, కుటుంబ తగాదా, వాహన ప్రమాద, రెవెన్యూ కేసులు మరియు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులను రాజీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ప్రజా సమస్యల శాశ్వత న్యాయ పీఠం చైర్మన్ ఏ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ ఈ శాశ్వత లోక్ అదాలత్ నందు ప్రయాణ, టెలిఫోన్, బ్యాంకు, ఆసుపత్రుల, విద్యా సేవలు ఉపాధి హామీ పనులు రియల్ ఎస్టేట్ తదితర ప సేవలపైన ఏమైనా సమస్యలు ఉన్న ఈ శాశ్వత న్యాయ పీఠాన్ని సంప్రదించాలని ఈ శాశ్వత పీఠంలో ఉచిత సేవలందించబడతాయని తెలియజేశారు. సీనియర్ న్యాయవాది కూన కృష్ణారావు మాట్లాడుతూ అగ్రిమెంట్లు రాసేటప్పుడు క్షుణంగా పరిశీలించుకుని సంతకం చేయాలని, అలాగే వృద్ధులైన తల్లిదండ్రులను సంరక్షణ బాధ్యత కుమారులతోపాటు కుమార్తెలకు ఉంటుందని కావున వృద్ధులను బాధ్యతతో చూసుకోవాలని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ మేతర అజయ్ బాబు మెప్మా సీఈవో రాజేశ్వరి మొదలైన వారు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



