అర్హత ఉంటే చాలు పథకాలకు పుట్టినిల్లు…

అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకం అందవలసిందే,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.

ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

ఆలమూరు (అఖండ భూమి):కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మనసా.. వాచా.. పదేపదే చెబుతున్నారు.నాలుగేళ్ల పాలనలో అక్షర సత్యాలు కనిపిస్తున్నాయి.గత ప్రభుత్వం తమ పార్టీ వారికి పథకాలన్నీ కట్టపెట్టుకున్న వైనం చూసారు.జగన్ పాలనలో పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని,జన రంజకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని కొత్తపేట శాసనసభ్యులు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం-1లో రెండవ రోజున నిన్న శుక్రవారం ఆలమూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్,ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసుతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.చెముడులంక సెంటర్లో గల శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.చెముడులంక సచివాలయం-1లో 5 సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.6.88 కోట్లతో నిర్మాణాలు,నవరత్నాల్లో భాగంగా 16 పథకాలకు సంబంధించి రూ.6.38 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ వైయస్ జగనన్న పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలతో పాటు సమాజంలో అభివృద్ధిని చేసి చూపామని అన్నారు.పథకాల అమలులో ప్రతి ఒక్కరి సంతృప్తిస్థాయి పెరగడం జగనన్న పాలనకు నిదర్శనం అన్నారు.గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు.ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు సకాలంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఆనందాన్ని కలిగిస్తుందని లబ్ధిదారులు చెప్తున్నారని అన్నారు.సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివన్నారు.మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.అలాగే చెముడులంకలో పొగాకు వ్యాపార సంస్థలు విరివిగా ఉండడంతో వారికి ప్రభుత్వం తరపునుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే చిర్లకు అడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు.మహిళలు మంగళహారతులుతో స్వాగతం పలికి పూల మాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్తకార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు,దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి),దూలం రామలింగేశ్వరరావు,దూలం సత్తిబాబు,యనమదల నాగేశ్వరరావు,నాగిరెడ్డి సత్యనారాయణ,అడబాల వీర్రాజు,చెల్లుబోయిన శ్రీనివాసు,దొండపాటి చంటి,బుడ్డిగ వీరవెంకట్రావు,దొండపాటి శ్రీను,రాయుడు వెంకటేష్,సుంకర శ్రీనివాసులు,మోటూరి సురేష్,తమ్మన హరిహర కుమార్,అడబాల వెంకట్రావు,బొర్రా వీరబాబు,మద్దిరెడ్డి వెంకన్న బాబు,సుంకర కామరాజు,పితాని రాంబాబు,ఎంపీడీవో జాన్ లింకన్,తాసిల్దార్ ఐపీ శెట్టి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ,ఇన్ఛార్జ్ హౌసింగ్ ఏఈ జేజిబాబు,ఏవో సోమిరెడ్డి లక్ష్మీ లావణ్య,ఏపిఎం దనరాజు,పంచాయతీ కార్యదర్శి యు రేణుక,పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!