అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తాసిల్దార్ కార్యాలయం నందు జిల్లా అధికారులతో వెల్దుర్తి మండల అధికారులు ముఖాముఖి వీడియో కాన్ఫిడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో వెల్దుర్తి తాసిల్దార్ రాజేశ్వరి మేడం ఆధ్వర్యంలో మండల అధికారులు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా పలు సమస్యలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సలహాలు సూచనలు పాటించాలని ఆదేశించడం జరిగింది. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను స్వీకరించి సకాలంలో అర్జీలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తాసిల్దార్ రాజేశ్వరి, పంచాయతీరాజ్ డి ఈ శేషయ్య, ఎం ఈ ఓ ఇందిరా, వెలుగు ఏపిఎం చంద్రశేఖర్, పి ఆర్ ఏ ఈ సురేంద్ర నాథ్ రెడ్డి, కరెంటు ఏ ఈ, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



