లిడికివలస గిరిజన గ్రామ ప్రజల దశాబ్దాల నాటి రోడ్డు కల నెరవేర్చిన ఎమ్మెల్యే అలజంగి.
ఎమ్మెల్యే జోగారావుచేతులు మీదుగా నేడు బిటి రోడ్డు నిర్మాణంనకు ఘనంగా శంకుస్థాపన.
పార్వతీపురం జూన్ 12 (అఖండ భూమి ) :ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో 1.23కోట్ల రూపాయలు నిధులతో సుమారు 2 మిలోమీటర్ల నూతన బిటి రహదారి నిర్మాణం పనులు ప్రారంభించారు.పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండలం, గోచెక్క పంచాయతి, లిడికి వలస గిరిజన గ్రామానికి పక్కా రహదారి చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు విశేషంగా కృషి చేసిన ఫలితంగా కోటి 23 లక్షల రూపాయలు నిధులను కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బిటి రహదారిని మంజూరు చేయగా సోమవారం 2 కిలోమీటర్లు నూతన రహదారి నిర్మాణం చేపట్టేందుకు నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సమక్షంలో ఘనంగా శంకుస్థాపన నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా తమ గ్రామానికి రోడ్డు కావాలని ఎదురు చూసిన గిరిజనుల నిరీక్షణకి మరికొద్ది రోజుల్లో తెర పడుతుంది అని, నూతన రహదారి నిర్మాణం అతి త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఏడాది క్రితమే నిధులు మంజూరు చేసినప్పటికీ గుత్తేదారులు ముందుకు రాక ఆలస్యం అయినది అయినప్పటికీ ఎలాగైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తీరాలనే తలంపుతో అందుబాటులో ఉన్న వారితో మాటలాడి నేడు నిర్మాణం పనుల కోసం శంఖుస్థాపన సహితం పూర్తి చేసుకోవడంతో పాటు కొద్దిరోజుల్లోనే నిర్మాణం సహితం పూర్తి చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎందరినో అడిగినా ఫలితం లేకపోయింది అని అయితే తమ సమస్యను స్వయానా చూసిన ఎమ్మెల్యే జ�

లిడికివలస గిరిజన గ్రామ ప్రజల దశాబ్దాల నాటి రోడ్డు కల నెరవేర్చిన ఎమ్మెల్యే అలజంగి.
