ఆసుపత్రి వ్యర్ధాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భగాది. జగన్నాధం రావు.
పార్వతీపురం, పాలకొండ,జూన్ 12 : ఆసుపత్రి వ్యర్ధాలపై (బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్) ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు అన్నారు. పాలకొండలో విజయ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సోమ వారం ఉదయం తనిఖీ చేశారు. ఆసుపత్రి వ్యర్ధాల యాజమాన్యంను పరిశీలించిన డి.ఎం.హెచ్.ఓ, ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యర్ధాల విసర్జన (డిస్పోజ్) జరగాలని ఆదేశించారు. వ్యర్ధాల విసర్జనలో అలసత్వం వహించరాదని ఆయన చెప్పారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వివరాలకు తప్పనిసరిగా రికార్డ్ నిర్వహించాలని ఆయన సూచించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఐహెచ్ఐపి ద్వారా పి ఫార్మ్, ఎల్ ఫార్మ్ లలో రోజు నమోదు అవుతున్న జ్వరాలు, తదితర వ్యాధుల వివరాలు తప్పకుండా ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని కేసుల్ని నోటిఫై చేయాలని అన్నారు. హాస్పిటల్ లో ధరల పట్టిక ఉండాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలపై ఆరా తీసారు. ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగానే అందుతున్నాయా, సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని ప్రశ్నించగా, ఆసుపత్రి సేవలు బాగానే అందుతున్నాయని తెలిపారు. చికిత్సకు వచ్చే వారికి చక్కటి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్వహణపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం వైద్యుల ప్రధాన అభిమతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిడమాలజిస్ట్ డా. నవీన్ కుమార్, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి డా. వినోద్ కుమార్, డెమో వై. యోగేశ్వర రెడ్డి, ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డా. సాయి శంకర్, మే�


