బాల సాహితీ రచయిత బి.వి.పట్నాయక్ కు కలెక్టర్ అభినందన.

బాల సాహితీ రచయిత బి.వి.పట్నాయక్ కు కలెక్టర్ అభినందన.

పార్వతీపురం జూన్ 12 (అఖండ భూమి ) :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,నర్సిపురం నందు పాఠశాల సహాయకునిగా పనిచేస్తున్న బీ. వీ. పట్నాయక్ రచనలపై ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి బోను బాలకృష్ణ చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ధృవీకరించిన ఆ పరిశోధనా గ్రంథాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ బహూకరించడంతో పాటు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు బాలసాహిత్యం అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్, ఏపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, ఏ పీ టీ ఎఫ్ పూర్వ అధ్యక్షులు బెహరా గుంపస్వామి, సంతోష్ కుమార్, బాల రచయిత్రి మోక్షజ మొదలగువారు పాల్గొన్నారు. నర్సిపురం ఉన్నత పాఠశాల సిబ్బంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెలగాం భీమేశ్వర రావు మరియు తోటి రచయితలుబి.వి.పట్నాయక్ ను అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!