జగనన్నకు చెబుదాం దరఖాస్తులకు సత్వర పరిష్కారం.

 

జగనన్నకు చెబుదాం దరఖాస్తులకు సత్వర పరిష్కారం.

పార్వతీపురం, జూన్12 (అఖండ భూమి ) : జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపించి, నివేదికలను సమర్పించాలని తెలిపారు.సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐ టి డి ఎ, ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 76 అర్జీలు అందజేశారు.

అర్జీల వివరాలు

పాచిపెంట మండలం తామరాపల్లి గ్రామపంచాయతీలో అనేక గ్రామాలు ఉన్నాయని గ్రామనికి గ్రామానికి మధ్య సరైన రోడ్డు సదుపాయం లేక ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామపంచాయతీలో ఉన్న గ్రామాలకు బీటి రోడ్ మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ డి.సీతమ్మ, గ్రామస్తులు కోరారు.

పాచిపెంట మండలం వడిసెలమడ గ్రామానికి చెందిన గిరిజనులు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు, కుడుమూరు మెట్టవలస జంక్షన్ నుండి వడిసెలమడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, గ్రామంలో ఆరు నెలలుగా మంచి నీటి పధకం మోటార్ పనిచేయడం లేదని వేసవిలో మండుటెండలో భావినీరు తోడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని కొత్త మోటర్ వేసి పైపుల ద్వారా నీరు అందించాలని ఆర్.వేణు, గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు.

పాచిపెంట మండలం కందిరివలస గ్రామం లో ఉన్న ప్రజలకు ఉపాధి కొరకు పాడి ఆవులు మరియు పి.టి. జి. గొర్రెల లోన్లు మంజూరు చేయాలని పి.లక్ష్మి దరఖాస్తు అందజేశారు.

గరుగుబిల్లి మండలం వల్లిరిగోడవ గ్రామానికి చెందిన గాదాపు ధనుంజయ నాయుడు తన భూమిక

Akhand Bhoomi News

error: Content is protected !!