బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.
జిల్లా జూనియర్ సివిల్ జడ్జి.

పార్వతీపురం, జూన్ 12 (అఖండ భూమి ) : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ ఛార్జ్ ఏ.రమేష్ అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా కోర్టు వద్ద జరిగిన ప్రత్యేక ర్యాలీని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రారంభించారు. ర్యాలీని ఉద్దేశించి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రమేష్ మాట్లడుతూ పేదరికం, తల్లిదండ్రులు లేకపోవడం, తల్లిదండ్రుల దురలవాట్ల వల్ల పిల్లలు బాలకార్మికలుగా తయారవుతున్నారని, వెట్టి చాకిరీకి గురి అవుతున్నారని అన్నారు. నేటి బాలురే రేపటి పౌరులు అని వాళ్లను ఎంత బాగా కాపాడుకుంటే దేశ భవష్యత్తును అంత కాపాడుకొనే అవకాశం వుందని ఆయన చెప్పారు. పిల్లలను ఎవరైతే బాలకార్మికులుగా చేస్తున్నారో వారు అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. బాలలను కార్మికులుగా మార్చితే వారిపై చర్యలు తీసుకొనుటకు అనేక చట్టాలు ఉన్నాయని ఆయన చెప్పారు. బాలలు బాల్యాన్ని ఆనందంగా అనుభవించాలని, బడిలో గడపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో జిల్లా సహాయ లేబర్ కమిషనర్ కె.రామకృష్ణా రావు, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు డా.టి. జగన్మోహన రావు, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.


