రైతన్నలకు చివరాయకట్టు వరకు సాగు నీరందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయం.

తోటపల్లి కొత్త కుడికాలువ ద్వారా సాగునీరు విడుదల చేసిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.
పార్వతీపురం, జూన్ 12 (అఖండ భూమి ) :2023 ఖరీఫ్ సీజన్ కి గాను నెలన్నర కాలం ముందే రైతన్నలకు సాగునీరు విడుదల చేసిన రైతు పక్షపాత ప్రభుత్వం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తోటపల్లి కుడికాలువ, ఉల్లిభద్ర: పార్వతీపురం మన్యం జిల్లా ఉల్లిభద్ర గ్రామం వద్ద గల తోటపల్లి నూతన కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల కార్యక్రమం నీటి పారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , కురుపాం శాసన సభ్యురాలు మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి , బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు , పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు ఉమ్మడి జిల్లాల ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని వారి చేతులు మీదుగా పూజ నిర్వహించిన అనంత్రం కాలువ గేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేయడం జరిగినది.అనంతరం రైతుల సమక్షంలో జరిగిన సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ మన ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మొదటి వ్యక్తి మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని తెలిపారు. వచ్చే 2023-24 ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలన్నర రోజుల ముందే సాగునీరు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో దేవుని కథ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో


