కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల మేజర్ గ్రామపంచాయతీ నందు నీటి కష్టాలు మొదలయ్యాయి. వెల్దుర్తి పంపు షెడ్డు కు తొగడుచెడు నుండి, బ్రహ్మగుండం నుండి, చెరుకులపాడు నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ నందు. దాదాపు 12వేల ఓటర్లు ఉన్నట్లు సమాచారం. 20 వేల వరకు ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా. దీంతో మేజర్ గ్రామపంచాయతీకి నీటిని అందించేందుకు అధికారులు ఇతర గ్రామాల నుండి నీటి సౌకర్యం కల్పించారు. అయితే పైప్ లైన్ వేసే దానిలో నాణ్యత లోపం ఉండడంతో అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో పైపులైన్లు లీక్ కావడం, పగిలిపోవడం, యంత్రాల ద్వారా కాలువలు తీసేటప్పుడు చూసుకోకుండా పగలగొట్టడం తదితర కారణాలవల్ల పైప్లైన్లు పగిలిపోతున్నాయి. దీంతో నీటిని సరఫరా చేసే వాటర్ మ్యాన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటి సరఫరా సక్రమంగా ఉన్నప్పటికీ పైపులైన్లు పనికి పోవడంతో మేజర్ గ్రామపంచాయతీ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చునీ పట్టణ ప్రజలు వాపోతున్నారు. మేజర్ గ్రామపంచాయతీకి నీటి వసతి కల్పించేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది అయినా పట్టించుకున్న పాపాన పోలేదు .


