రాజమ్మ తల్లి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 28: (అఖండ భూమి) స్థానిక సంత మార్కెట్లో వేంచేసి ఉన్న రాజమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సంబరాధనలో 3,000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ రాజమ్మ తల్లి అమ్మవారి 19వ జాతర మహోత్సవం సందర్భంగా మొన్న అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించామని మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బాణసంచా కాల్పులతో నిర్వహించామని శుక్రవారం నాడు మహానసమరాధన నిర్వహించి అన్న ప్రసాదం వితరణ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



