తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలి – ఒమ్మి రఘురామ్

తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలి – ఒమ్మి రఘురామ్

కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 28 : (అఖండ భూమి) తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడాలని, ప్రతి రోజు వారు పాఠశాలలో ఎం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో తెలుసు కోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కు కష్ట పడతారని, పిల్లలు అన్నీ ఇవ్వడం ఎంత అవసరమో సమయం కూడా కేటాయించి వారి ప్రవర్తనను ఒక కంట కనిపెట్టాలని అన్నారు, వారిని ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారిగా తయారు చేయాలన్నారు. ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన సోషల్ ఆడిట్ లో భాగంగా జరిగిన పేరెంట్స్ మీటింగ్లో రఘురామ్ పాల్గొని మాట్లాడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు గురించి, వసతుల గురించి తల్లిదండ్రులతో చర్చించడం జరిగింది. తల్లి దండ్రులు పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల చదువులకు ఎంతో ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ చదువులు ఇంగ్లీష్ మీడియం ద్వారా అందుబాటులోకి తెచ్చిందన్నారు, పాటశాల కు అవసరమైన అన్ని విషయాలలో అన్ని రకాలుగా సహకరిస్తానని తెలియజేసారు. ఆడ పిల్లలను బాగా చదివించాలని, పదవ తరగతి పూర్తయితే పెళ్లిళ్లు చేయడం సరికాదని, అది చట్ట రీత్యా నేరని అమ్మాయి వివాహ వయస్సు 21 సంవత్సరాలుగా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రాజా, ఎంపీటీసీ ఆకుల శ్రీధర్, బచ్చల సుధీర్,

Akhand Bhoomi News

error: Content is protected !!