నాదెండ్ల మనోహర్ తో పాటంశెట్టి ప్రత్యేక సమావేశం
కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 28: (అఖండ భూమి) మత్స్యకారులకు అండగా జనసేన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు విచ్చేసిన జనసేన పార్టీ పి ఎ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కాకినాడ ముత్తా క్లబ్ లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బలోపేతం అయ్యిందని అన్నారు. దానికి కారణం మీరు ప్రారంభించిన జనం కోసం జనసేన అనే కార్యక్రమం అని ఇంటిని కుటుంబాన్ని వదిలి ఒక 10 రోజులు బయట ఉంటేనా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అలాంటిది గత 500 రోజులుగా మీరు మీ శ్రీమతి శ్రీదేవి గారితో కలిసి పార్టీ అభివృద్ధి కోసం జనాలతోనే ఉంటూ, గ్రామాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి జీవించడం అనేది చాలా కష్టతరమైన విషయం అని అన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమం 500 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్రకు ప్రత్యేక అభినందలు తెలియజేశారు. మీరు మన పార్టీ ని ప్రజలలోకి తీసుకెళ్లడమే కాకుండా వారికి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కృషి చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పారు. ఇదేవిధంగా మీరు కష్టపడితే జగ్గంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగురవేయగలమని తద్వారా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…