Fire Accident : తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం..
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గర్లోనే ఉన్న ఫొటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..
క్షణాల్లో అవి షాపు మొత్తం వ్యాపించాయి. వెంటనే స్థానికులు… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని భావిస్తున్నారు. ఐతే.. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫొటో ఫ్రేమ్ షాపులో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారా లేదా అన్నది తెలియట్లేదు. మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు. మంటలు చాలా వేగంగా ఇతర షాపులకు వ్యాపిస్తున్నాయి. అక్కడ గాలి బాగా వస్తుండటంతో… మంటలు వేగంగా ఎగసిపడుతున్నాయి.
ఈ ఫొటో ఫ్రేమ్ షాపులో రకరకాల ఫొటోలు, స్వామి వారి ఫొటోలు ఉంటాయి. ఈ షాపు ఉన్న సందులో ప్రజలు ఎక్కువగా వస్తూ, వెళ్తూ ఉంటారు. ఈ ప్రమాదం కారణంగా… అటువైపు రాకపోకలను రద్దు చేశారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కరెంటు సరఫరా కూడా నిలిపివేశారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ఓ గంటలో మంటలు అదుపులోకి రావచ్చు అంటున్నారు..
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..