బాపట్లలో ఘోరం..టెన్త్ విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన స్నేహితుడు..
రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలెంలో ఘటన..
బాపట్ల:ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు..
తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలేనికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం ఎప్పట్లానే రాజోలులో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు..
బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి తనపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమర్నాథ్ చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..