ప్రజాసేవకు నూతన భాష్యం చెప్పిన జగనన్న పాలన – ఒమ్మి రఘురామ్

ప్రజాసేవకు నూతన భాష్యం చెప్పిన జగనన్న పాలన – ఒమ్మి రఘురామ్

కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 28: (అఖండ భూమి) ప్రజల వద్దకే పాలన, ఇంటి ముంగిటే సుపరిపాలన,గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, పారదర్శకపాలన, అవినీతిరహిత పాలన, డి బి టి పద్దతిలో సంక్షేమ పేదల నేరుగా లబ్ధిదారుల ఖాతాకు అందజేత,35 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ, అర్హత ఉన్న చివరి లబ్ధిదారుని వరకూ ఎవరికీ లేదనకుండా సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాసేవకు నూతన భాష్యం చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వై యస్ ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు, మా నమ్మకం నువ్వే జగన్, జగన్ననే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఆయన జగ్గంపేట గ్రామములో హెచ్ పి బంక్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, పార్టీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు, ప్రజా మద్దతును తెలుసుకొనేందుకు వారిని ప్రశ్నలు అడిగి సమాధానము రాబట్టారు. గత ప్రభుత్వం కు జగనన్న ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అవినీతి పాలన అందిస్తే జగనన్న దళారీల వ్యవస్థ లేకుండా వాలేంటీర్లు ద్వారా పారదర్శక, అవినీతి రహిత పాలన సాగిస్తున్నారని వివరించారు. పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా సుమారు 2 లక్షల కోట్లు అందించి వారి పేదరిక నిర్ములనకు, ఆత్మాభిమానం తో బ్రతకడానికి జగనన్న ప్రభుత్వం తోడ్పాటు అందించిదన్నారు.జగన్ పాలన, అందుతున్న సంక్షేమ పథకాల వలన ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజ్, గొల్లపల్లి శ్రీను,ఆకుల శ్రీధర్, వైసీపీ నాయకులు కపవరాపు ప్రసాద్, p. వీరబాబు, నీలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు,గొలపల్లి ప్రసాద్, బత్తిన అశోక్,ఇసారపు సురేష్,కట్టు రాజు,చేరుకురి రాజు, పలపట్టి నాగేశ్వరావు, కామరి సూరిబాబు,నక్క వీర బ్రహ్మం,సిల్లీ రాంబాబు,కొల్లు ఏసు, కొల్లు సతీష్, కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!