
యానాంలో పుదుచ్చేరి ప్రధానకార్యదర్శి సుడిగాలి పర్యటన పిడబ్ల్యుడి తదితర శాఖల పనితీరుపై ఆగ్రహం..
యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఎమ్మెల్యే ల్యాడ్ నిధులు వచ్చినా పనులు ప్రారంభించడం లేదు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆవేదన
డంపింగ్ యార్డును తొలగించాలి రీ సైక్లింగ్ పార్క్ ఏర్పాటుచేయాలి
పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ వర్మ శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
సంవత్సరాల తరబడి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న కనకాలపేట డంపింగ్ యార్డు తొలగింపు డిమాండ్ నేపధ్యంలో ఆయన డంపింగ్ యార్డును క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణం కనకాలపేట డంపింగ్ యార్డును తొలగించాలని గోపాల్ నగర్లోఎంపిక చేసిన స్థలంలో రీసైక్లింగ్ పార్క్ను నెలకొల్పి అందరిని దాని ప్రాధాన్యతను తెలపాలన్నారు. ఆ ప్రాంతంలో సేంద్రీయ ఎరువులు మాత్రమే తయారవుతుందని స్థానికులను అవగాహన చైతన్యవంతులు చేయాలన్నారు
గోపాల్ నగర్ లో కోట్లాది రూపాయిల ఖర్చుతో నిర్మాణం చేస్తున్న ఆయుష్ ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతింగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అక్కడ నుంచి గోదావరి వరదల సమయంలో తరుచూ ముంపుకు గురవుతున్న ఓల్డ్ రాజీవ్ నగర్ ప్రాంతాన్ని అక్కడ నిర్మాణం చేస్తున్న ఔటాఫాల్సూయిజ్ లాకులను పరిశీలించారు. రాజీవ్ బీచ్ ను పరిశీలించి శిధిలమవుతున్న శివబ్బాత్ను బాగుచేయించాలన్నారు.అక్కడ నుంచి దరియాలతిప్ప ఐలాండ్-3 లో మడ అటవీ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించి ఉడెన్ వాక్వే ద్వారా బోటు షికారు చేశారు.
మడ అటవీ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించారు పర్యాటకాభివృద్ధికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తనకు నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పిడబ్ల్యుడి తదితరశాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల్యాడ్ నిధులు వచ్చినా పనులు ప్రారంభించడం లేదు ఎమ్మెల్యే అశోక్ ఎమ్మెల్యే ల్యాడ్ నిధులు మంజూరయినప్పటికీ అభివృద్ధి పనులు మాత్రం చేపట్టకుండా సంబంధిత పిడబ్ల్యుడి అధికారులు కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ వర్మ ను కోరారు. స్థానిక
ఎస్.ఆర్.కె ప్రభుత్వ కళాశాల సమావేశ గదిలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్లపట్టాలు మంజూరుచేయాలని ఇప్పటికే పలు భూములను పరిశీలించినట్లు తెలిపారు. పసుపురంగు రేషన్ కార్డుల్లో అర్హులైన బి.పి.ఎల్ వర్గాల వారికి ఎరుపురంగు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. స్థానిక జిజిహెచ్లో ఆధునిక వైద్యసదుపాయలను కల్పించాలని, డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా ఋణాలను నిలిపివేసారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పనులు ప్రారంభించకపోతే తక్షణం అధికారులపై చర్యలు తీసుకోవాలని మరో నెలలో సమీక్ష పనులు నిలివేసినవారిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని ప్రధానకార్యదర్శి రాజీవ్ వర్మ హెచ్చరించారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యంను నిరాకరించే ఆసుపత్రులను బ్లాక్ లిస్ట్లో పెట్టి భారతప్రభుత్వానికి తెలుపుతామన్నారు. వికలాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు మరో నెలరోజుల్లో మళ్లీ సమీక్ష ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఇన్ఛార్జి కలెక్టర్ ఎల్ కుమార్, హెల్త్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఆర్ఎఒ మునిస్వామి, మున్సిపల్ కమీషనర్ ద్విజ్ గోయల్, పిడబ్ల్యుడి, విద్య, వైద్య, విద్యుత్ తదితరశాఖల అధికారులు
పాల్గొన్నారు.


