కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

 

Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

రావులపాలెం పట్టణం: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీకొన్నాయి..

అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!