గ్రామాల్లోని సమస్యలు పాలకులకు పట్టవా? జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

 

నాతవరం మండలం వెదురుపల్లి గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెలగా వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర హాజరయ్యారు నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలపై పాలకులకు పట్టదా అని సూర్యచంద్ర ఎద్దేవా చేశారు నాలుగేల్లుగా జనసేన పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ గార్కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ పెదగొలుగొండపేట నుంచి వెదురుపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా ఉందన్నారు స్మశానంకి వెళ్లే దారిలో ఉన్న గెడ్డపై వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గాలికి వదిలేశారన్నారు దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన అన్నారు అంతే కాకుండా మంచినీటి సమస్య అధికంగా ఉందని అర్హత ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు ఎమ్మెల్యే గణేష్ సమస్యలపై స్పందించే వారిని విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు ప్రతిపక్షాలు సమస్యలపై నిలదీస్తుంటే దానికి సమాధానం చెప్పలేక తన కార్యాలయంలో తమ నాయకుల చేత బూతు పురాణాలు పలికిస్తున్నారని వాటిపై పెట్టే దృష్టిని ఆయన నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిపై పెట్టలేదన్నారు గడపగడపకు వెళుతున్న ఎమ్మెల్యే అక్కడ సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలన్నారు ఇప్పటికైనా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని తద్వారా రాష్ట్రం బాగుపడుతుందని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి యువత అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అనిమిరెడ్డి జాన్ పంచాడ సిద్దు పారుపల్లి వాసు నకరపు నాని గవిరెడ్డి లక్ష్మణ్ దుర్గాప్రసాద్ పారుపల్లి సతీష్ పారుపల్లి సిద్దు కొరుప్రోలు నాని లోకవరపు సురేష్ బాలిరెడ్డి సూరిబాబు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!