వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

 

 

గ్రామ స్థాయిలోనే ఆర్ బీ కె ల ద్వారా వ్యవసాయ పథకాలు అందిస్తూ విప్లవాత్మక మార్పులతో పాలన సాగిస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. శనివారం నాడు కొరుప్రోలు క్యాంపు కార్యాలయంలో జరిగిన రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక అని, వ్యవసాయానికి, రైతులకు అండగా నిలబడుతూ విప్లవత్మాక మార్పులతో పాలన సాగిస్తున్నామని దానికి ఉదాహరణే రైతు భరోసా కేంద్రాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఎస్.రాయవరం మండల వ్యవసాయధికారిణి సౌజన్య మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ కు మండలంలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందని ఇందులో భాగంగా రాయితీపై పచ్చిరొట్ట వరి విత్తనాల పంపిణీ జరుగుతుందని మండల పరిధిలో వరి విత్తనాలు అర్ జి ఎల్ 2537-999 క్వింటాళ్లు  బి పి టి 5204- 100 క్వింటాళ్లు,ఎం టి వూ 1061- 64 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వరి విత్తనాలు కిలో రూ 10 చొప్పున రాయితీఇవ్వబడుతుందని ఆమె తెలిపారు ఆర్ జి ఎల్ 2537 30 కిలోల బస్తా రు 834/- బిపిటి 5204 25 కిలోల బస్తా – రు 697.5/ఎమ్ టి వు 1061 30 కిలోల బస్తా రు 843/- ధరలకు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని రైతులు తమ పట్టాదార్ పాసు పుస్తకం,ఆధార్ కార్డుతో వివరాలు నమోదు చేసుకుని విత్తనాలు పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి కాకర దేవి ఎంపిపి కోన లోవలక్ష్మి  పార్టీ సీనియర్ నాయకులు వీసం రామకృష్ణ పోలిశెట్టి పెద ఈశ్వరరావు చేకూరి శ్రీరామ చంద్రరాజు,శీరం నరసింహ మూర్తి, శ్రీపతి రాజు వీసం నానాజీ వెలగా ఈశ్వర్రావు మల్లె లోవరాజు నూకినాయుడు బాబురావు,రమణ నక్కపల్లి ఏవో ఉమా ప్రసాద్ ఆర్ బి కె సిబ్బంది పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొనడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!