ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఈ మేరకు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేశారు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ కక్కిస్తుందని.. వైసీపీ, టీడీపీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు. ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన పేరుతో నిర్వహిస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
టీడీపీపాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ అని.. ఆ పార్టీ ఏర్పాటు, అది అధికారంలోకి రావడం దురదృష్టం అని మండిపడ్డారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. రెండు పార్టీలు రాజధాని విషయంలో అన్యాయం చేశాయని ఆగ్రహించారు..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…