వేసవి తరగతుల పోస్టర్ ఆవిష్కరణ:
సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో వేసవి సెలవులలో నిర్వహించే ఉచిత శిక్షణ తరగతుల పోస్టర్ను పిఠాపురం మండల విద్యాశాఖ అధికారి శ్రీ R.V. ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరూ ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2021 నుండి గత 22 సంవత్సరాలుగా ఈ ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించుచున్న సహృదయ మిత్రమండలి సభ్యులను అభినందించారు. మిత్రమండలి అధ్యక్షులు తోట శ్రీనివాసు మాట్లాడుతూ మే ఒకటవ తేదీ నుండి 15వ తేదీ వరకు పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. సోషల్ వెల్ఫేర్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులలో స్పోకెన్ ఇంగ్లీష్ , కమ్యూనికేషన్స్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, క్రియేటివ్ ఆర్ట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, చిన్నారి సతీష్, పోతుల శ్రీనివాసు, P. వేణు, P. కామరాజు, G. సరస్వతీ రాజు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…