రైతులకు నష్టపరిహారం ఇవ్వండి టి.డి.పి
తాళ్లరేవు అఖండ భూమి వెబ్ న్యూస్ :
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పంట మునిగింది పరిహారం ఇవ్వండి అనే కార్యక్రమం స్థానిక లయన్స్-క్లబ్ హల్ లో నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి మాట్లాడుతూ
ఈ వైయస్సార్ ప్రభుత్వంలో రైతులు కి అంతా-నష్టం వాటిల్లింది అని మన జిల్లాలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు కారణంగా పంటలు పాడైన సంగతి అందరికి తెలిసిందే అని అటువంటి పంటలను రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా కొనవలసింది పోయి రైతులకు అనేక నిబంధనలు పెట్టి కొనుగోలు చేసారని ఆవిధంగా చేయడంవలన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రతీ గ్రామపంచాయతీ లోను ఈవిధంగా నష్ట పోయిన రైతులు వివరాలు సేకరించి అధికారులు దృష్టి కి మరియు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు దృష్టి కి తీసుకు వెళ్తామన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ధూళిపూడి వెంకటరమణ, ముమ్మిడివరం నియోజకవర్గం రైతు అధ్యక్షులు కొత్తూరు కాశీ ఈశ్వరుడు, బి.సి సెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, మందార గంగ సూర్యనారాయణ, వెంట పిల్లి ఉమా మహేశ్వరి, జక్కల ప్రసాద్,మోర్త భైరవమూర్తి, రోళ్ళ చక్రవర్తి, పిల్లి సత్తిబాబు, మేడిశెట్టి సత్తిబాబు, కుడిపూడి రామకృష్ణ, దాసరి వేణుగోపాల్, చంద్రాల బుజ్జి, తదితరులు పాల్గొన్నారు



