గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అభిమానులు సైనికుల పని చేయాలి..

టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర!
అల్లూరి జిల్లా,హుకుంపేట, అఖండ భూమి :-
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అభిమానులు సైనికుల పని చేయాలని టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర అన్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కు మద్దతుగా ఈనెల 20 తేదీన మంగళవారం నాడు యండపల్లి వలస రైల్వే స్టేషన్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు యువగళం సంఘీభావ పాదయాత్ర నిర్వహిస్తున్నమని సివేరి దొన్ను దొర
పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో
టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర
మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాక్షస పాలనతో వైసీపీ ప్రభుత్వం సాగిస్తు నవరత్నాల పేరుతో అభివృద్ధికి కుంటుపడే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామంటూ బూటకప మాటలు చెప్పి ప్రజలకి గాలిలో వదిలేసారని చదువుకున్న యువకులకు మోసం చేశారంటూ ఆయన విమర్శించారు. గతంలో యువతీ యువకులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మందికి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటేందుకు నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొవాలని అన్నారు.
2024లో రానున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని గెలుపుకు సాదృశ్యంగా సంఘీభావం యాత్ర ద్వారా ఉనికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
యువగళం పాదయాత్ర కు మద్దతుగా ముంచంగి పుట్టు, హుకుంపేట, డుంబ్రిగూడ, అరకు వేలి, అనంతగిరి,
ఆరు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని
సంఘీభావం పాదయాత్రను విజయవంతం చేయాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.


