ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య ను తీర్చేందుకు రూ 12.5 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనులు

 

ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య ను తీర్చేందుకు రూ 12.5 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనులు

ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు రుణపడి ఉంటామంటున్న ఎస్సీలు

తుగ్గలి జూన్ 18( ప్రభ న్యూస్)

మండలం పరిధిలోని చెన్నంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు రూ 12.5 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మా ఎస్సీ కాలనీలో పర్యటించినప్పుడు పలువురు ఎస్సీలు తమ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తక్షణమే ఆ కాలనీలో ఎస్సీలకు మంచినీటి సమస్య పరిష్కరించేందుకు పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ 12.5 లక్షల మంజూరు చేయించారు. ఈ పనులను స్థానిక వైసిపి నాయకులు రంజాన్, సుభాన్, పులి లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చేతుల మీదుగా ఎస్సీ కాలనీకు మంచినీరు సరఫరా చేస్తామన్నారు. కాలనీకి చెందిన పలువురు ఎస్సీలు మాట్లాడుతూ తమ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మా నిధులు మంజూరు చేయించడం పట్ల తాము ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు రుణపడి ఉంటామని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!