ప్రధాని మోడీ కి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ లేఖ.

 

పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని ప్రధాని మోడీ కి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ లేఖ.

జిల్లా అధ్యక్షులు వైపివీరన్న

తుగ్గలి జూన్ 18 అఖండ భూమి వెబ్ న్యూస్ :

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడి కు లేఖ రాసినట్లు జిల్లా అధ్యక్షులు వైపి వీరన్న తెలిపారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

వైసీపీ నాయకులు సుపారి గ్యాంగ్ లను ఏర్పాటు చేశారు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు అని వైపి వీరన్న పేర్కొన్నారు.

వైసీపీ నాయకులు అధికారం కోసం ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు అని వైపి వీరన్న తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీస్, జడ్జి లకు, మంత్రులకు కూడా రక్షణ లేదని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగిందని తెలిపారు. రాష్ట్రము లో ని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ,బలహీన వర్గాలు వైసీపీ పాలన లో రోజూ హత్యలు, మానభంగాలు కు గురి అవుతున్నారు అని లేఖలో ప్రధానికి వివరించామన్నారు.

ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని , కావున డీజీపీ నుండి తొలగించి రాష్ట్ర ప్రజల ను రక్షించాలి అని వైపి వీరన్న విజ్ఞప్తి చేశారు.

దళితుల ను హత్యలు చేసి ఇంటికి పంపే పార్టీ దేశంలో వైసీపీ పార్టీ అని వైపి వీరన్న తెలిపారు. ఫోటో రైట్ అప్ (18 తుగ్గలి02) విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వైపి వీరన్న

Akhand Bhoomi News

error: Content is protected !!