మండలానికి ఇద్దరు ఎంఈఓ లు నియామకం పట్ల హర్షం
జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్
తుగ్గలి జూన్ 18 అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్య అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇద్దరు ఎంఈఓ లను నియమించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నట్లు పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలానికి ఇద్దరు ఎంఈఓ నియమించడం పట్ల ఉపాధ్యాయుల కు ప్రభుత్వ నుండి రావలసిన జీతభత్యాలు త్వరగా వస్తాయని, అలాగే పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఎంఈఓ లకు సులభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నియమించిన పే కమిషన్ తొందరగా ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఆయన కోరారు.



