చికెన్ ధరలకు రెక్కలు.
రాజవొమ్మంగి, అఖండ భూమి జూన్ 18
వేసవిలో కోడి మాంసం ధరలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో విరియోగ్దారులు గగ్గోలు పెడుతున్నారు. పేదవాడి ఆహారంగా చెప్పబడే కోడి మాంసం ఇటీవల కాలంలో మాంసం ప్రియులను భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పవచ్చు. మార్కెట్లో చికెన్ తక్కువ ధరకు లభిస్తూ ఉండడంతో ప్రతివారు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. అటువంటి చికెన్ సామాన్యుడికి ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ఇటీవల కొన్ని రోజుల నుండి ప్రతినిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మాంసం ధర 320 రూపాయల వరకు పలుకుతూ ఉండడంతో ఆ ధరను చూసి మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. రేట్లు పెరగడానికి ప్రధాన కారణం మండుతున్న ఎండలేనని దుకాణాల యజమానులు చెబుతున్నారు. వేసవిలో బ్రాయిలర్ కోళ్లు పెంపకం కష్టతరంగా ఉంటుందని అన్నారు. బ్రాయిలర్ కోళ్లు అత్యంత సున్నితంగా ఉంటాయని వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉందని అంటున్నారు. వాతావరణం చల్లగా ఉన్న రోజుల్లోనే ప్రతినిత్యం కొన్ని కోళ్లు మృత్యువాత పడతాయని ప్రస్తుతం వీస్తున్న వేడి కాళ్లు ఎండ కారణంగా డ్రాయిలర్ కోళ్ల పెంపకం కష్ట సాధ్యంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది కోళ్ల ఫారం యజమానులు పెంపకాలను నిలిపివేసి కోళ్ల ఫారాలకు సంబంధించి మరమ్మత్తులు పనులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి కాలం శుభకార్యాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కోడి మాంసం అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి శుభకార్యానికి కోడి మాంసం వంటకం సాధారణంగా మారింది. అలాగే వివిధ రెస్టారెంట్ హోటలలో ప్రతినిత్యం వందల కేజీలు మాంసం అవసరమై ఉంది. దీనితో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు.దీనితో ప్రతి ఒక్కరూ మాంసం పైనే ఆధారపడి ఉన్నారు. అవసరార్థం మాంసం దుకాణం వద్దకు వెళ్తే అక్కడ దుకాణదారుడు చెప్పిన ధరను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కోళ్ల సంకేతగ్గడం మాంసానికి డిమాండ్ ఏర్పడడంతో గత రెండు నెలల క్రిందట 150 నుండి 160 కిలో ధర ఉండే మాంసం ప్రస్తుతం అమంతంగా రెట్టింపు అయ్యింది. దీనితో మాంసం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయని చెప్పవచ్చు. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితేనే కానీ ఈ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



