రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు- ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్

 

రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు- ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్

రాజవొమ్మంగి, అఖండ భూమి జూన్ 18 రాజవొమ్మంగి మండలంలో వాహనదారులు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.మండల కేంద్రమైన రాజవొమ్మంగి లో ఆదివారం సాయంత్రంపోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ వాహనరికార్డులను పరిశీలించారు. కారు డిక్కేలు తనిఖీ చేశారు. గంజాయి సారాయి, మారక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారించడంలో భాగంగా పోలీసులుతనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వచ్చి పోయే వాహనాలను నిశితంగా పరిశీలించారు. వాహనదారులు రికార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాహన చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్, పి సి రమణ, ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!