Chandra babu: నేరగాళ్లకు ఊతమిచ్చేలా సీఎం జగన్ వైఖరి: చంద్రబాబు..
అమరావతి: వైకాపా పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు..
బాపట్ల జిల్లా జిల్లాలో బాలుడి సజీవదహనం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.
”సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు ఊతమిచ్చేలా ఉంది. మహిళలకు భద్రత లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. బిల్లులు రాక గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గంజాయి, గన్ కల్చర్ పెరుగుతున్నాయి. కష్టపడి సంపాదించిన ఆస్తిని వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. రాష్ట్రం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం.. విశాఖ కిడ్నాప్ వ్యవహారం” అని చంద్రబాబు వివరించారు..


