అనుమానితుల కోసం ఆరా… !

 

అల్లూరి జిల్లా సీలేరు వారపు సంతలో పోలీసుల విస్తృత తనిఖీలు అనుమానితుల కోసం ఆరా

అల్లూరి జిల్లా సీలేరు (అఖండ భూమి): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సీలేరు వారపు సంతలో సిఆర్పిఎఫ్ పోలీసులు సివిల్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎస్సై రామకృష్ణ ప్రధాన కుడళ్ళు వద్ద పోలీసు బలగాలని మొహరించి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు కార్లు ఆటోలు తదితర వాహనాలను తనిఖీలు నిర్వహించి అనంతరం వ్యక్తులు వివరాలు సేకరించి అనంతరం విడిచిపెట్టారు. అదేవిధంగా గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణా పై పోలీసులు నిఘ పెట్టారు. ఏపీ జెన్కో చెక్పోస్టు రామాలయం ఐటిఐ జంక్షన్ వద్ద సివిల్ మరియు సిఆర్పి పోలీస్ బలగాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి వచ్చే పోయే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో సీలేరు కేంద్రంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి పలువురు అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!