అల్లూరి జిల్లా పాడేరు ఏపీ ఎస్ ఎస్ డి సి ఈ నెల 20 వ తేదిన నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి/ పాడేరు (అఖండ భూమి )అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డిసి) ఉపాధి కార్యాలయం మరియు సీ డా ప్ సంయుక్త ఆధ్వర్యం లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ,పాడేరు నందు ఈనెల 20వ తేదీన (మంగళవారంవారం) ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 3గం.ల వరకు 10 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పాడేరు *శాసనసభ్యులు శ్రీమతి* *కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ మెగా జాబ్ మేళా “అపోలో ఫార్మసీ, నవత రోడ్ ట్రన్స్పోర్ట్, డెక్కన్ కెమికల్స్, పేటియం,కేర్ ఫర్ వై ఎస్ కే ఇన్ఫోటెక్, కాజెంట్ ఈ సర్వీసెస్, మరియు ఇతర ప్రముఖ కంపనీలు పాలుపంచుకుంటున్నాయని
కావున జిల్లాలోని 18 సం,, నుండి 30సం,, మధ్య గల ఇంటర్మీడియట్,డిప్లొమా ,డిగ్రీ , బి.టెక్ మరియు ఆపై చదువు పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూ కు పాన్ కార్డు ,ఆధార్ కార్డు మరియు సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు . ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు జీతం 10,000/- నుండి 20,000 వరకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగ పరుచుకోవాలని జి. ప్రశాంత్ కుమార్ , జిల్లా నైపున్యభివ్రుద్ది అధికారి, ఏపీ ఎస్ ఎస్ డి సి తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



