కక్షకారపణ్యాలకు ప్రేరేపించే విధంగా పెడదారిపడుతున్న యువతను సరైన దారిలో నిలిపే విధముగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర మంత్రి జోగి రమేష్ లకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఉప్పాలవారిగ్రామానికి చెందిన విద్యార్థి ఉప్పాల అమర్ నాథ్ మృతిపై సంతాపం తెలిపి, ప్రభుత్వం అందిస్తానన్న రూ. పది లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేయడానికి ఆదివారం గ్రామానికి వచ్చిన వారికి పలు విజ్ఞాపనలు ఆయన తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జిల్లా అధ్యక్షుడు జువ్వా శివరాం ప్రసాద్ ఆదేశాల మేరకు వారిని కలిసిన ఆయన మాట్లాడుతూ బాలికలు రాజోలు పంచాయతీ కేంద్రంలోని పాఠశాలకు ఆ గ్రామం మీదుగా వెళ్లడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. అల్లరిమూకల ఆకతాయి చేష్టలకు వారు పాఠశాలకు వెళ్లేందుకే విముఖత చూపటం లేదని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం ఇస్తానన్న రూ. 10 లక్షలు తో సరిపెట్టక పేదలైన బాధిత కుటుంబానికి రూ. ఒక కోటి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటిపై స్పందిస్తూ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇస్తామన్న హామీలు ఇప్పటికే 80 శాతం పూర్తి చేసామని తెలిపారు. బాలిక ఏస్ ఐ అవ్వాలని గ్రామస్తులు తెలిపారని, ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే తప్పక తాము ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి కార్యకర్త ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, జిల్లా న్యాయ సలహాదారుడు అంగలకుదురు నటరాజన్, బాపట్ల పట్టణ యువజన అధ్యక్షులు ఉప్పల్ దీన్నే గోపీనాథ్ జిల్లా కార్యదర్శి ఈడే శ్రీనివాసరావు, జిల్లా నేత వీరమల్లు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.



