జలజీవన్ మిషన్ పధకం ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు.
ఎస్.రాయవరం. ఏప్రిల్ 28. అఖండ భూమి
శుక్రవారం నాడు మండలంలోని ఒమ్మవరం గ్రామంలో జలజీవన్ మిషన్ పధకంలో భాగంగా సుమారు 40 లక్షల వ్యయంతో,60 వేల లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పాయకరావుపేట శాసన సభ్యులు గొల్ల బాబురావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో మంచి నీరు అందించాలనే లక్ష్యంతో ఈ పధకాన్ని ప్రారంభించారని, ఇటువంటి మరెన్నో పధకాలు, గ్రామాల అభివృద్ధి జరగాలంటే మరలా జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, మీ సర్పంచ్ పి పాపి నాయుడు ఎంపీపీ లోవలక్ష్మి పి రామరాజు పి పెదేశ్వరరావు డి శ్రీపతి రాజు కే రాజా రమేష్ కార్యకర్తలు, సత్తిబాబు పినపాల ప్రసాదు మాదాజీ గురునాథరావు అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు