జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జగన్ జగనన్న సురక్ష పథకం పై వర్క్ షాప్ – ఎంపీడీవో లాలం సీతయ్య తహసిల్దార్ తిరుమలరావు.

 

అల్లూరి జిల్లా,కొయ్యూరు,అకండ భూమి, వెబ్ న్యూస్:

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో జగనన్న సురక్ష కార్యక్రమం పై సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్స్ వీఆర్వో పంచాయతీ కార్యదర్శులతో వర్క్ షాప్ నిర్వహించినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య మంగళవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగనన్న సురక్ష పథకం కార్యక్రమం జూలై 1 నుండి ఆగస్టు ఒకటి వరకు మందంలో ఉన్న 23 సచివాలయంలో మండల టీములు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు, 12 సచివాలయాలను ఎంపీడీవో సీతయ్య 11 సచివాలయాలను తాసిల్దార్ తిరుమలరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు,జూలై 1 సచివాలయం మండల స్థాయిలో క్యాంపులు నిర్వహించే ముందు జూన్ 24 నుంచి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటారని అన్నారు, సర్టిఫికెట్లు జారీకి సంబంధించి కూడా ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని వెంటనే నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు,ప్రజలు ఏదైనా పత్రాలు సంబంధించి సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే త్వరిత గడిపిన పరిష్కరించేందుకు ప్రభుత్వము ఈ కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు,ప్రజల పిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగుతుందన్నారు,  ఈ జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలు సమస్యలకు సంబంధించి మండల అధికారులు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు లేదా ఏదైనా పత్రాలు సర్టిఫికెట్లు సంబంధించిన ఏ సమస్యలు ఉన్న వారిని వెంటనే తీసుకువచ్చి వారికి కావలసిన సర్టిఫికెట్లు లేదా డాక్యుమెంట్లుకు అర్హులకు సంబంధించి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి నాయుడు,డిటి, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!