• మా సాగు భూములో,జీడి తోటల్లో నల్లరాయి క్వారీ లీజులు రద్దు చేయాలి.:- పేర గొట్టపాలెం గిరిజనులు ఆందోళన!! •  జిల్లా జాయింట్ కలెక్టర్ క్వారీ ప్రదేశాన్ని సందర్శించాలి.  • జులై 3న గొర్రెలు,మేకలతో పాదయాత్ర, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.

 

 

 

 

 

 

• మా సాగు భూములో,జీడి తోటల్లో నల్లరాయి క్వారీ లీజులు రద్దు చేయాలి.:- పేర గొట్టపాలెం గిరిజనులు ఆందోళన!!

 

•  జిల్లా జాయింట్ కలెక్టర్ క్వారీ ప్రదేశాన్ని సందర్శించాలి.

 

• జులై 3న గొర్రెలు,మేకలతో పాదయాత్ర, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.

 

అనకాపల్లి జిల్లా, రావికమతం, అఖండ భూమి, వెబ్ న్యూస్:

 

 

అనకాపల్లి జిల్లా,రావికమతం మండలం పరిధిలో గల గుడ్డిప పంచాయతీ కి చెందిన పేర గోట్టపాలెం గ్రామంలో గల కొండదొర కులానికి చెందిన పది కుటుంబాల ముప్పై మంది జనాభా గల ఆదివాసీ గిరిజనులు మరుపాక రెవిన్యూ తీన్ మెట్ట సర్వే నెంబర్ 258లో 22 ఎకరాలు బి.ఎం.జె అప్పారావు పేరుమీద రోడ్డు మెటల్ బిల్డింగ్, స్టోన్ క్రషర్ క్వారీకి మా సాగు భూమిలో అనుమతులు ఇచ్చారు, క్వారీ ప్రదేశంలో మరుపాక పంచాయతీ పరిధిలో గల గదపాలెంలో 16 కుటుంబాల ఆదివాసీ గిరిజనులు గత 20 సంవత్సరాల నుండి జీడి మామిడి తోట,యూకలిఫ్ట్ తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని,మాతో పాటు మరపాక పేద రైతులు 15 కుటుంబాలు వారు క్వారీకి సమీపం ప్రదేశంలోనే జీడి తోటలతో సాగు చేస్తున్నారు,

మాకు సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు,మైనింగ్ మాఫియా కొమ్మ కాస్తూ,మా భూములపై నల్లరాయి క్వారీ అనుమతులు తేడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు,గత పబ్లిక్ షేరింగ్ లో మమ్మల్ని మాట్లాడిని వ్వకుండా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పర్యావరణ అనుమతులు సభ తూ..తు మంత్రంగా నిర్వహించారన్నారు, ఇప్పటికే మరపాక ప్రాంతంలో

మా గ్రామానికి ఆనుకొని ఉన్న స్టోన్ క్రషర్, నల్లరాయి క్వారీల వల్ల మా గ్రామంలో ఒక చేతి బోరు, బావి,బోర్లు నీళ్లు అడుగట్టిపోయాయని అన్నారు,ఇప్పటికే మాకు తెలియకుండా కొంతమంది కొండకి బ్లాస్టింగ్ చేస్తున్నారని, తోటలకు నడిచి వెళ్ళేటప్పుడు అనేక ఇబ్బందులు గురవుతు న్నామన్నారు,మైనింగ్ క్వారీ లీజులు రద్దు చేయకపోతేఈ వారం రోజుల్లో పేరగొట్టిపాలెం గ్రామం నుండి మేకలు గొర్రెలు పాదయాత్ర చేసుకుంటూ రావికమతం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయంతీసుకోవడం జరిగిందన్నారు,తక్షణమే మైనింగ్ లీజులురద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, మూలపర్తి నూకాలమ్మ,మొలపర్తి వరాలమ్మ, మాలపర్తి అప్పారావు, గిరిజనులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!